ప్ర. హైడ్రాక్సి క్లోరోక్విన్ నిల్వలు భారత్‌లో ఎంతవరకు ఉన్నాయి?
జ. 80 శాతం హెచ్‌సీక్యూను భారత్ విడుదల చేస్తోంది. కొవిడ్-19కి ఈ డ్రగ్ వాడవచ్చు అని తెలిశాక దీనికి బాగా గిరాకీ పెరిగింది. ప్రపంచ దేశాలకూ మనం పంపిణీ చేస్తున్నాం. 30 మెట్రిక్ టన్నలు డ్రగ్స్ ఉత్పత్తి చేసే స్థితిలో ఉన్నాం.
ప్ర. పారసిటమోల్ డ్రగ్స్‌కు సంబంధించిన ముడిపదార్థాలు చైనా నుంచి దిగుమతి చేసుకోవచ్చా?
జ. ఔషధాల తయారీకి సరిపడా ముడిపదార్థాలు భారత్‌లో ఉన్నాయి. చైనాలోని వుహాన్‌లో పరిస్థితులు ఇప్పటికే మెరుగుపడ్డాయి. వుహాన్ నుంచి ముడిపదార్థాలు దిగుమతి చేసుకోవచ్చు.
ప్ర. భారత్‌లో ఫార్మా సెక్టార్ ఎంత వరకు ఈ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది?
జ. ఒకవేళ భారత్‌లో రెండు కోట్ల మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినా... వాళ్లకి వాడగలిగేంత స్టాక్‌ను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్ర. ప్రపంచ దేశాలు ఈ సాయాన్ని గుర్తుపెట్టుకుంటాయా?
జ. 10 కోట్ల మాత్రలు ఉత్పత్తి చేసే దశలో మనం ఉన్నాం. అలాంటప్పుడు మనకన్నా... క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రపంచదేశాలకు మనం ఔషధాలు ఇవ్వాలి. 20 ఏళ్ల క్రితం ఎయిడ్స్ నియంత్రణలోనూ భారత్ కీలకపాత్ర పోషించింది. ఈ సాయాన్ని ప్రపంచదేశాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాయి.
'క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు ఔషధాలు ఇవ్వాలి'