తెలంగాణ

telangana

ETV Bharat / state

Guidlines For Covid Exgratia: కొవిడ్ మృతులకు రూ.50 వేల పరిహారం.. సర్కారు జీవో

కొవిడ్ మృతులకు పరిహారం చెల్లించే అంశాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి పరిహారాన్ని నేరుగా కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని వెల్లడించింది.

Guidlines For Covid Exgratia
కొవిడ్ మృతులకు పరిహారం

By

Published : Nov 10, 2021, 8:05 PM IST

కరోనా మరణించిన వారికి జిల్లా కలెక్టర్లు పరిహారం మంజూరు చేయనున్నారు. ఈ మేరకు వారికి అధికారాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు రూ.50వేల రూపాయల పరిహారాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపే పరిహారం అందించాలని జీవోలో పేర్కొంది

మీసేవాలో అన్ని పత్రాలు సమర్పించాలి

మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పేర్కొన్న అన్ని పత్రాలను మృతుల కుటుంబ సభ్యులు ఆన్ లైన్​లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ పరిహారాన్ని మంజూరు చేస్తారని వెల్లడించింది. పరిహారం మొత్తాన్ని ఆధార్​తో అనుసంధానమైన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్​కు బదిలీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి:

'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే'

Corona Death certificates : జిల్లాల్లోనే కొవిడ్ మరణ ధ్రువపత్రాలు..

ABOUT THE AUTHOR

...view details