కరోనా రెండో దశ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లి, న్యూ బోయిన్పల్లి పరిసర ప్రాంతాలలో సొంత వాహనానికి మైక్ అమర్చి ప్రచారం చేశారు.
'ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించండి' - hyderabad latest news
సికింద్రాబాద్ పరిధిలో కొవిడ్ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వీఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కరోనా అవగాహన కార్యక్రమం
కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని.. శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు.
ఇదీ చదవండి:సిమ్రాన్.. నీ నవ్వు జిగేల్ జిగేల్!