కరోనా టీకా ప్రక్రియలో భాగంగా ఏపీలోని విశాఖ కేజీహెచ్‌లో మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు (క్లినికల్ ట్రయల్స్) అనుమతుల కోసం మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన బాధ్యతలను గతంలో మెడిసిన్ విభాగ సహాయ ఆచార్యుడు వాసుదేవ్‌కు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) అప్పగించింది. ఇప్పుడు ఆయనను మార్చి కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ పి.వేణుగోపాల్‌కు అప్పగిస్తూ బీబీఐఎల్.. ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుధాకర్‌కు తాజాగా లేఖ రాసింది.
విశాఖ కేజీహెచ్‌లో కొవిడ్ టీకా ప్రయోగాలకు సన్నాహాలు - కేజీహెచ్‌లో కొవిడ్ టీకా వార్తలు
కొవిడ్ టీకా ప్రక్రియలో భాగంగా ఏపీలోని విశాఖ కేజీహెచ్‌లో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే జరగనున్నాయి. వీటి అనుమతుల కోసం మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.
కేజీహెచ్‌లో కొవిడ్ టీకా ప్రయోగాలకు సన్నాహాలు
గతంలో పలు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన అనుభవం వేణుగోపాల్‌కు ఉంది. బీబీఐఎల్‌తోపాటు పలు ఇతర సంస్థలు కేజీహెచ్‌లో మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించామని, తుది ఆమోదం కోసం డీఎంఈ కార్యాలయానికి ఈ నెల 20న పంపనున్నట్లు సుధాకర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు రాగానే ప్రయోగాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి :'సల్మాన్ సినిమాకు నో చెప్పినందుకు బెదిరించారు'