రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. కొత్తగా 1,550 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 36,221కు చేరినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 926 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే బయటపడినట్లు తెలిపింది. రంగారెడ్డి 212 మందికి వైరస్ సోకింది. కరీంనగర్‌లో ఏకంగా 86 మంది కొవిడ్ బారిన పడ్డారు. మేడ్చల్ 53, నల్గొండ జిల్లాలో 41 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మంలో 38, కామారెడ్డిలో 33 మందిలో వైరస్‌ను గుర్తించారు. సంగారెడ్డిలో 19, వరంగల్ అర్బన్‌లో 16, మహాబూబాబాద్, మహాబూబ్‌నగర్ జిల్లాల్లో 13 చొప్పున కరోనా కేసులు వెలుగు చూశాయి.
భద్రాద్రి, జనగామ, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో పదేసి కేసులు వచ్చాయి. వరంగల్ రూరల్, నిజామాబాద్ జిల్లాల్లో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఏడుగురికి వైరస్ సోకింది. భూపాలపల్లి, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఆరేసి కేసులు... యాదాద్రి, గద్వాల్ జిల్లాల్లో ఐదేసి కొత్త కేసులు బయటపడ్డాయి. వికారాబాద్‌లో ముగ్గురు, నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు మహమ్మారి బారిన పడ్డారు. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.