Covid Cases Increased in Telangana :రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,322 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 12 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంగా యాక్టివ్ కేసుల(Covid Active Cases) సంఖ్య 38కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఒకరు కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కొవిడ్ స్టేటస్ బులిటెన్ విడుదల చేసింది.
కొత్త వేరియంట్‌తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు
కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌లో 9, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. అదేవిధంగా నిలోఫర్ ఆస్పత్రిలో 6 నెలల చిన్నారి కరోనా బారినపడింది. రాష్ట్రంలో 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరో 30 మంది రిపోర్టులు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
Health Minister Raja Narsimha Review on Covid 19 Cases : కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రమంగా వ్యాపిస్తున్న కరోనాను అరికట్టేందుకు ఉన్న వసతుల గురించి మంత్రి ఆరాతీశారు. ఆక్సిజన్ సిలిండర్లను(Oxygen Cylinders) సరైన తీరుగా వినియోగించడం, పూర్తిస్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాలను కూలంకుషంగా చర్చించారు.
Corona Cases Increasing in Telangana :ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేయాలని మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.