Covid Cases in Telangana Today : కొవిడ్ పూర్తిగా అంతరించిపోయిందని భావించేలోపే మళ్లీ దేశంలో చాపకింద నీరులా పాకుతోంది. కొత్త వేరియంట్లతో ప్రజలకు దడపుట్టిస్తోంది. కరోనా, కరోనా 2.0, ఒమిక్రాన్ వీటితో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్లీ మరో కొత్త వేరియంట్ జేఎన్ 1(Covid New Variant JN 1) దేశంలో వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొత్త వేరియంట్‌తో భయం వద్దు - జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్న వైద్యులు
Telangana Government Alert on Covid New Variant: రాష్ట్రంలో కొవిడ్ నివారణపై పలు చర్యలు తీసుకున్నామని వైద్యులు తెలిపారు. కొవిడ్ నిర్ధారణ అయితే తగిన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మరో 6 కరోనా కేసులునమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 925 మందికి పరీక్షలు నిర్వహించారు.
అందులో ఆరుగురికి కొవిడ్ పాజిటివ్‌గా(Telangana Covid Cases) నిర్ధారణ అయిందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వ్యాధి సోకిన వారిలో నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఒకరు మెదక్, మరొకరు రంగారెడ్డికి చెందిన వారు ఉన్నారు. మరో 54 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికి ఒకరు రికవరీ అయ్యారు.