తెలంగాణ

telangana

ETV Bharat / state

covid in schools: పాఠశాలల్లో వెలుగు చూస్తున్న కొవిడ్​ కేసులు - తెలంగాణ వార్తలు

పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే కరోనా(corona) కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు(covid cases) బయటపడ్డాయి.

covid
covid

By

Published : Sep 3, 2021, 10:45 PM IST

ములుగు జిల్లా(mulugu district) ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. గురువారం విధులకు హాజరైన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు... విద్యార్థులకు పాఠాలు బోధించారు. మిగతా ఉపాధ్యాయులు పరీక్ష చేయించుకోగా... వారికి నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ పాఠశాలలోనూ ఓ విద్యార్థిని, అటెండర్‌కు కరోనా సోకింది. విద్యార్థిని తండ్రికి కూడా పాజిటివ్ అని తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు... పాఠశాలలోని 75మందికి కొవిడ్‌ పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో ఎంఈవో ఆంద్రయ్య, వైద్యాధికారులు పాఠశాలను సందర్శించారు. కొవిడ్ భయంతో పాఠశాలకు ఐదుగురు విద్యార్థులే హాజరయ్యారు. భయం భయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతున్న వేళ... కరోనా కేసులు బయటపడుతుండటం కలకలం సృష్టిస్తోంది.

ఇదీ చూడండి:Coronavirus kerala: కేరళలో మరో 32వేల కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details