తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు - Covid cases growing in new areas in Greater Hyderabad

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో లాక్​డౌన్​ నిబంధనలు సడలించగా.. కొవిడ్​ వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా శనివారం 33 మందికి పాజిటవ్​ రాగా.. కొత్త ప్రాంతాల్లో కరోనా వైరస్​ను గుర్తించారు. లక్షణాలున్నవారు, వలసకూలీలు గాంధీ ఆసుపత్రి వద్ద క్యూ కడుతున్నారు.

Covid cases growing in new areas in Greater Hyderabad
గ్రేటర్​లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్​ కేసులు

By

Published : May 24, 2020, 9:34 AM IST

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గతంలో కరోనా విస్తరించని ప్రాంతాలకూ పాకుతోంది. శనివారం 33 మందికి నిర్ధరణయింది. గ్రేటర్‌లో మొత్తం 1,100 కేసులు నమోదయ్యాయి. లక్షణాలతో మరో 21 మంది ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలోను, 22 మంది నల్లకుంట ఫీవరాసుపత్రిలోను చేరారు.

'గాంధీ'కి వలస కూలీల వరుస

నగరానికి వచ్చిన వలస కూలీలు గాంధీ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. శనివారం పది మంది కరోనాతో ఆసుపత్రిలో చేరగా, ఈ వారంలో 70 మంది చేరినట్లయింది.

అమ్మమ్మ ఇంటికెళ్లి..

బోరబండ బంజారానగర్‌లో మాంసం దుకాణం నిర్వహించే యువకుడి(27)కి వైరస్‌ సోకింది. అమ్మతో కలిసి వారం క్రితం ఈ యువకుడు పహాడీషరీఫ్‌లోని అమ్మమ్మ ఇంటికెళ్లాడు.

మంగళ్‌హాట్‌లో ఆగని వ్యాప్తి

మంగళ్‌హాట్‌లోని జుంగూర్‌బస్తీకి చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి(62)కి పాజిటివ్‌ రావడంతో గాంధీకి తరలించారు. అప్పర్‌ ధూల్‌పేటలోని బంగ్లాదేశ్‌ బస్తీలో కిరాణా షాపు యజమాని(58)కి పాజిటివ్‌ వచ్చింది.

పూలతోటలో ఇద్దరు వలస కూలీలకు

ముంబయి నుంచి మాదన్నపేటలోని కుర్మగూడ, పూలతోటకు వచ్చిన ఇద్దరు వలస కూలీలకు వైరస్‌ వచ్చింది.

వృద్ధుడి నుంచి డ్రైవరుకు

కరోనా బారినపడి ఈనెల 20వ తేదీ నుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆల్విన్‌కాలనీ డివిజన్‌ శుభోదయకాలనీకి చెందిన వృద్ధుడు(80) మృతిచెందాడు. అప్పటికే ఆయనకు క్యాన్సర్‌ ఉంది. ఆయన డ్రైవర్‌ కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌ సాయినగర్‌ వాసి(52)కి శనివారం కరోనా నిర్ధారణ అయింది.

ఒకే ఇంట ముగ్గురికి

సైబరాబాద్​లోని రెడ్డిబస్తీలో ఓ మహిళ(30)తోపాటు ఆమె కుమారుడు(7) వైరస్‌ బారిన పడ్డారు. కుర్మగూడలో ఓ ఇంట్లో ఈ మహిళ తల్లి పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెకు తొలుత వైరస్‌ సోకింది.

రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటున్నా..

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు రెండేళ్లుగా సనత్​నగర్లోని అశోక్‌కాలనీలో ఇంటికే పరిమితమయ్యాడు. ఆశ్చర్యంగా ఆ యువకుడికి కరోనా సోకింది. సోదరుల ద్వారా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.

కుటుంబాలను చుట్టబెడుతోంది

మణికొండ మున్సిపాలిటీ అలీజాపూర్‌లో ఒకే ఇంట్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11కి చేరింది. శనివారం మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయింది. చాంద్రాయణగుట్ట జహంగీరాబాద్‌లో ఒకే ఇంట్లోని ఆరుగురికి సోకింది. చాదర్‌ఘాట్‌ చౌరస్తా కామ్‌గార్‌నగర్‌ మున్సిపల్‌ క్వార్టర్స్‌లో ఓ వ్యక్తి(45), సుందర్‌నగర్‌లో వృద్ధుడు(79), గోల్నాక చర్చిలేన్‌లో యువకుడు(30), నింబోలిఅడ్డ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మహిళ(50)కు, అంబర్‌పేట తురాబ్‌నగర్‌లో వ్యక్తి(45)కి కరోనా సోకింది.

మరో కానిస్టేబుల్‌, హోంగార్డుకు

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఓ కానిస్టేబుల్‌, హోంగార్డుకు కరోనా సోకింది. కుటుంబ సభ్యులతోపాటు వారితో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు. జాగ్రత్తలు చేపట్టినా వైరస్‌ బారిన పడుతుండడం ఆందోళన రేపుతోంది.

ఇదీ చూడండి:సోమవారం రంజాన్​ వేడుకలు.. నెలవంక వల్లే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details