తాజాగా వరుస పండగల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన ఉత్పరివర్తనాలు వ్యాప్తి చెందితే... మూడో దశలో కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మాస్కు ధరించడం, గుంపులకు దూరంగా ఉండటం, శుభ్రత పాటించడం చాలా అవసరమని సూచిస్తున్నారు.
కేసులు తగ్గినా సున్నాకు చేరలే... అప్రమత్తంగా లేకపోతే అంతే.. - తెలంగాణ తాజా వార్తలు
కొన్ని రోజులుగా భాగ్యనగరంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. చాలా కేంద్రాల్లో జీరో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం నగర వ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, టెస్టింగ్ సెంటర్లలో మొత్తం 6888 మందికి కరోనా యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా.. కేవలం 31 మందికి మాత్రమే పాజిటివ్ తేలింది. కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన... అజాగ్రత్తగా ఉంటే అసలుకే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైరస్‌లో వేగంగా ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయి. రెండో దశ కేసులను ఈ సందర్భంగా వైద్యులు గుర్తు చేస్తున్నారు. డెల్టా వేరియంట్ వల్ల రెండో దశలోనే వేలాది మంది మహమ్మారి బారిన పడ్డారు. గాంధీలో 1800 పడకలు అందుబాటులోకి తెచ్చినా సరే... చికిత్సల కోసం నిరీక్షణ తప్పలేదు. పడక కోసం ఆరేడు గంటలు నిరీక్షించాల్సి వచ్చేది. అయితే కొన్ని రోజులుగా నగరంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. చాలా కేంద్రాల్లో జీరో కేసులు నమోదు అవుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన... అజాగ్రత్తగా ఉంటే అసలుకే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:Covid deaths: కొవిడ్ మరణాలకు వైరస్‌తోపాటు ప్రధాన కారణమేంటో తెలుసా?