తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం' - srisailam

కరోనా సోకితే సామాన్య మానవుడు కాటికి పోయే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్​ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్​కుమార్​ అన్నారు. కాచిగూడలో నిర్వహించిన కరోనా అవగాహన సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దిలీప్​కుమార్​ అన్నారు.

covid awareness meeting in hyderabad
'కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైంది'

By

Published : Aug 23, 2020, 9:38 PM IST

కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రాష్ట్రీయ లోక్​దళ్​ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. హైదరాబాద్​ కాచిగూడ వైష్ణవి హోటల్​లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రముఖ డాక్టర్ వసంత్ కుమార్, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎల్.రమణ, అద్దంకి దయాకర్, బాల మల్లేష్, విమల, తదితరులు హాజరయ్యారు.

కరోనా సోకితే సామాన్య మానవుడు కాటికి పోయే పరిస్థితి దాపురించిందని కపిలవాయి దిలీప్​కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా హబ్​గా ఉన్న హైదరాబాద్ నగరంలో కొవిడ్​ నివారణ చర్యలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ గవర్నర్ కూడా నివారణ చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. శ్రీశైలం ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూపాయి డాక్టర్​గా పేరొందిన చెరుకు సుధాకర్, ఆయన తనయుడిని అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'

ABOUT THE AUTHOR

...view details