Covid 19 Variant JN1 Virus : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం వైద్య ఆరోగ్య అధికారులను (Medical Health Officers) సూచించింది. రాష్ట్రంలోనూ యాక్టివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, కేసులు పెరిగితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్పత్రులుసన్నద్ధమవ్వాలని మార్గదర్శకాలు (guidelines) జారీ చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు.
Corona Cases In Telangana : ఐసీయూ సహా అన్ని రకాల సౌకర్యాలతో కోవిడ్ కోసం ప్రత్యేక పడకలను (Special beds)సిద్ధం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్(Osmania Hospital Superintendent)పేర్కొన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా, ఆర్ టీపీసీఆర్ కిట్లు(RTPCR Kits), అవసరమైన మందులు ఉండేలా చూస్తున్నామన్నారు. మాస్కులు ధరించటం సహా అన్ని రకాల కొవిడ్ నిబంధనలు పాటించాలని సిబ్బంది ఆదేశించినట్టు స్పష్టం చేశారు.
తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం - అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి
Corona News Update :దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వరంగల్వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కొత్త వేరియంట్ జేఎన్ 1 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా వరంగల్ ఎంజీఎం(MGM) ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 50 పడకలతో కొవిడ్ వార్డును (Covid ward) ఏర్పాటు చేశామని ఎంజీఎం ఆర్ఎంఓ మురళి స్పష్టం చేశారు. మొత్తం 50 పడకలలో 10 పడకలలో వెంటిలేటర్లను మరో 20 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేశామని వైద్యులు తెలిపారు.
Chest Hospital Provides Facilities for Corona :కోవిడ్ జేఎన్ 1 వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి(Erragadda Chest Hospital) సూపరింటెండెంట్ డా.మహబూబ్ ఖాన్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలోని అన్ని విభాగాలు, వైద్య సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గతంలో 50 పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కరోనాకు చికిత్స అందించామని చెప్పారు.