రాష్ట్రంలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 97,424కు పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో 77.17 శాతం మంది కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా 1,195 మంది కోలుకోగా... మొత్తంగా కరోనా బారినపడి ఆరోగ్యవంతులుగా మారిన వారి సంఖ్య 75,186కు చేరినట్లు వివరించింది. ఈ విషయంలో జాతీయ సగటు 73.64 శాతమని తెలిపింది.
ఈనెల 19న రాత్రి 8 గంటల వరకూ నమోదైన సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసింది. తాజా ఫలితాల ప్రకారం జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలో 395 కేసులు నిర్ధారణయ్యాయి. 20కి పైగా పాజిటివ్‌లు నమోదైన జిల్లాల జాబితాలో రంగారెడ్డి(169), మేడ్చల్ మల్కాజిగిరి(105), కరీంనగర్(101), వరంగల్ నగర(91), నల్గొండ(67), నిజామాబాద్(61), సిద్దిపేట(61), మంచిర్యాల(45), సంగారెడ్డి(45), సూర్యాపేట(44), పెద్దపల్లి(43), ఖమ్మం(42), జోగులాంబ గద్వాల(37), రాజన్న సిరిసిల్ల(37), జగిత్యాల(35), మెదక్ (34), వరంగల్ గ్రామీణ(32), కామారెడ్డి(32), మహబూబ్‌నగర్(32), మహబూబాబాద్(28), వనపర్తి(28), భద్రాద్రి కొత్తగూడెం(27), నిర్మల్(23), నాగర్‌కర్నూల్(22) ఉన్నాయి.