తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం - గాంధీ ఆసుపత్రిలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం

covid-19 patient dead body missing from gandhi hospital secunderabad
గాంధీ ఆసుపత్రిలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం

By

Published : Jun 11, 2020, 1:01 PM IST

Updated : Jun 11, 2020, 2:13 PM IST

12:54 June 11

గాంధీలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడి మృతదేహం అదృశ్యమైంది. కొవిడ్​-19 పాజిటివ్​ కారణంగా గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం అతని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని అడగ్గా... మృతదేహం అదృశ్యమైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

తమ సోదరుడి మృతదేహాన్ని అప్పగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. అతని మృతదేహాన్ని ఇతరులకు అప్పగించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం ఎంత మంది చనిపోయారు?, మార్చురీకి ఎవరిని తరలించారన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

ఇదీ చూడండి:దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!

Last Updated : Jun 11, 2020, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details