తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో కొనసాగుతున్న కొవాగ్జిన్ ప్రయోగాలు - నిమ్స్​లో కొవాగ్జిన్ ప్రయోగాలు

కొవాగ్జిన్ మూడో విడత క్లినికల్ ట్రయల్స్​లో నిమ్స్​లో కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 42 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

covaxin vaccine
నిమ్స్​లో కొనసాగుతున్న కొవాగ్జిన్ ప్రయోగాలు

By

Published : Nov 19, 2020, 7:17 AM IST

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ ప్రయోగ పరీక్షలు హైదరాబాద్‌ నిమ్స్‌లో కొనసాగుతున్నాయి. మూడోదశలో భాగంగా బుధవారం 22 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చినట్లు ప్రత్యేక వైద్య బృందం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 42 మంది వాలంటీర్లకు ఇచ్చామని వైద్యులు పేర్కొన్నారు. రోజూ ఈ ప్రక్రియ కొనసాగుతోందని, మొదటి, రెండోదశ వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details