కరోనాను అరికట్టేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించి మూడో దశ(చివరిది) క్లినికల్ పరీక్షలు వచ్చే నెలలో మొదలు కానున్నాయి. మొదటి లేదా రెండో వారంలో వీటిని ప్రారంభించనున్నట్లు నిమ్స్ వైద్య వర్గాలు తెలిపాయి. క్లినికల్ పరీక్షల్లో భాగంగా ఇప్పటికే నిమ్స్‌లో తొలి దశ పరీక్షలు ముగిశాయి.
రెండో దశలో భాగంగా మంగళవారం 12 మందికి టీకా ఇచ్చి బూస్టర్ డోస్ ప్రక్రియ ప్రారంభించామని క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వచ్చే మూడు రోజుల వ్యవధిలో మరో 55 మందికి టీకా ఇస్తామన్నారు. 14 రోజుల తర్వాత వీరందరి రక్త నమూనాలు సేకరించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కి పంపనున్నారు.