నిమ్స్‌లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం - నిమ్స్‌లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
![నిమ్స్‌లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం covaxin clinical trials starts in nims hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8093227-748-8093227-1595231107696.jpg)
06:24 July 20
నిమ్స్‌లో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
కరోనా వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్ నిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్ డోస్ ఇచ్చారు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.
హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్-3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
TAGGED:
కోవాక్సిన్ తాజా వార్తలు