ఆర్టీసీ పీఎఫ్ విభాగానికి రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశం - court order to rtc to pay money to ccs
20:51 November 06
ఆర్టీసీ పీఎఫ్ విభాగానికి రూ.200 కోట్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశం
కార్మికుల పొదుపు సహకార సంఘానికి రూ.200 కోట్లు డిపాజిట్ చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో డబ్బు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. కార్మికులు తీసుకున్న రుణ వాయిదాల వడ్డీలను వారి జీతాల్లోంచి తీసుకుంటున్న ఆర్టీసీ.. వాటిని తమకు డిపాజిట్ చేయడం లేదని సొసైటీ ఏప్రిల్లో కోర్టును ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం డబ్బులు కట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 411 కోట్ల రూపాయలు ఆర్టీసీ తమకు బకాయిలు ఉందని సొసైటీ పిటిషన్లో పేర్కొంది.
ఇవీ చూడండి:ఆర్టీసీపై 9గంటలపాటు సమీక్ష- ప్రత్యామ్నాయాలపై సీఎం దృష్టి
TAGGED:
rtc strike