హైదరాబాద్ తిలక్‌నగర్ ఇందిరానగర్‌లో వ్యాపారి మహిపాల్‌సింగ్, ఆశాకౌర్‌లు నివాసముంటున్నారు. అప్పు తీర్చలేక ఓ తండ్రి తన కూమార్తెను నాలుగేళ్ల క్రితం పెంచుకోవడానికి మహిపాల్‌కు ఇచ్చాడు. పెంచుకుంటామంటూ ఆ దంపతులు చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. పైకి ప్రేమను నటిస్తూ చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. అప్పటి నుంచి చిన్నారితో ఇంట్లో పని చేయించుకోవడమే కాకుండా ఒంటినిండా వాతలు పెట్టి... తాళ్లతో బంధించేవారు.
విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. ఛైల్డ్‌లైన్ ప్రతినిధి నాగరాజు ఫిర్యాదుతో దంపతులను అదుపులోకి తీసుకున్నారు.