తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య - SUICIDE NEWS IN HYDERABAD

హైదరాబాద్​ నిజాంపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా తమ నివాసంలోనే ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

COUPLE SUICIDE IN NIJAMPET WITH FAMILY PROBLEMS
కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

By

Published : Apr 15, 2020, 12:40 PM IST

కుటుంబ కలహాల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్​ బాచుపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. నిజాంపేట శ్రీనివాసకాలనీలో ఓ ఫార్మా కంపెనీలో పనిచేసే పి.సురేందర్‌ (42)-బిందు(36) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య రెండు మూడు రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పైఅంతస్తులోనే నివాసముంటున్న వీరి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలిద్దరూ అనాథలయ్యారని అక్కడి వారు రోదించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details