Couple Murder in Hyderabad :యూట్యూబ్ ద్వారా ఏర్పడిన పరిచయం, వ్యాపారానికి బాటలు వేసింది. గొర్రెల పెంపకం, విక్రయం వ్యాపారంలోభాగస్వామ్యం కోసం విడతలవారీగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడకపోవడం ఇరువురి మధ్య కక్షకు దారితీసింది. చివరకు దంపతుల హత్యకు కారణమైంది. గతనెల 29న హైదరాబాద్‌లోని సత్యకాలనీలో మహిళ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడకి వెళ్లిన పోలీసులు ఆమెని ఫాతిమాగా గుర్తించి హత్యచేసినట్లుగా కేసు నమోదు చేశారు.
Couple Killed Brutally in Hyderabad :మృతురాలి భర్తఫోన్ స్విచాఫ్ ఉండటం, అతని హెల్మెట్, ఇతర వస్తువులు లభించగా భర్త హత్య చేసినట్లు అనుమానించారు. ఫాతిమా మృతదేహానికి పోస్టుమార్టం చేశాక కుటుంబీకులకు అప్పగించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించగా, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గతనెల 29వ తేదీ మధ్యాహ్నం లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు సమీపంలో 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి అందులో ఒకరు మణికొండకు చెందిన సమీర్‌గా గుర్తించారు. అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఫాతిమాను చంపింది భర్తకాదని ముంబయికి చెందిన అజ్ఘర్ పాషాగా గుర్తించారు.
మహబూబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు.. బాలుడి హత్యకేసులో నిందితుడికి మరణశిక్ష
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :హైదరాబాద్‌కు చెందిన మహిళను పదేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న అజ్ఘర్ పాషా, నదీం కాలనీలో ఉంటూ గొర్రెల పెంపకం, విక్రయం చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం యూట్యూబ్ ద్వారా జుబేర్ ఖాద్రీతో పరిచయం ఏర్పడింది. ఆనంతరం వారిద్దరి మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. జుబేర్ ఫామ్‌హౌజ్‌లో గొర్రెలు, మేకలు పెంచేందుకు అజ్ఘర్ విడతల వారీగా 20 లక్షలకు పైగా చెల్లించాడు. లాభం ఇవ్వకపోవటంతో డబ్బులు ఇచ్చేయాలని కోరగా జుబేర్ దాటవేస్తూ వచ్చాడు. కక్షపెంచుకున్న అజ్ఘర్, జుబేర్ హత్యకు కుట్ర పన్నాడు.