హైదరాబాద్ సనత్నగర్లో మానవత్వం మరచి విచక్షణారహితంగా ఓ విద్యార్థిపై దాడి చేశారు. రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిపై దాడికి తెగబడింది ఓ మహిళ. స్కూల్ విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారంటూ అమాయక బాలుడిపై దంపతులిద్దరూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అతను ఏమి చేయలేదు అంటూ మరో విద్యార్థి బతిమిలాడినా వినలేదు.
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు - సనత్నగర్ విద్యార్థిపై దాడి
ఆడుకునే వయసు అతనిది. బడికి పోతూ దారి వెంబటి ఆడుకుంటూ వెళ్లడమే ఆ పిల్లోడు చేసిన తప్పైంది. ఈ పనే ఓ మహిళకు చిరాకు తెప్పించింది. ఇంకేముంది ఆ బాలుడిపై పిడిగుద్దులు గుద్దింది. తీరా అతనిపైనే కేసు పెట్టింది.
![కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు attack on school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6123501-291-6123501-1582090629487.jpg)
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు
దెబ్బలను తట్టుకోలేక ఆ బాలుడు కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. ఇంత చేసి తిరిగి ఆ విద్యార్థిపైనే కేసు పెట్టారు. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు దాడికి తెగబడ్డ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అకారణంగా తన బిడ్డపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు
Last Updated : Feb 19, 2020, 3:12 PM IST