తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరీక్షణకు తెర... సుదీర్ఘంగా కొనసాగిన పట్టభద్ర ఓట్ల లెక్కింపు - Telangana news

సుదీర్ఘంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. హబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి మొత్తం 93 మంది బరిలో నిలవగా, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో దాదాపు 90 గంటలపాటు లెక్కింపు సాగింది. వివిధ శాఖలకు చెందిన అయిదు వేల మంది సిబ్బంది, ఉన్నతాధికారులు రోజుకు మూడు విడతల్లో పనిచేశారు. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్గొండలో 100 గంటలకు పైగా కొనసాగింది.

నిరీక్షణకు తెర... సుదీర్ఘంగా కొనసాగిన పట్టభద్ర ఓట్ల లెక్కింపు
నిరీక్షణకు తెర... సుదీర్ఘంగా కొనసాగిన పట్టభద్ర ఓట్ల లెక్కింపు

By

Published : Mar 21, 2021, 5:20 AM IST

నాలుగు రోజుల సుదీర్ఘ ప్రక్రియ... అలసి సొలసిన శరీరాలు, కుర్చీల్లోనే కునికిపాట్లు, పన్నెండు గంటల పాటు ఏకధాటిగా విధి నిర్వహణ... ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ... రౌండురౌండుకు వెలువడే ఫలితంతో అంకెలతో కుస్తీ... ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగిన తీరు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు శనివారంతో పూర్తయింది.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి మొత్తం 93 మంది బరిలో నిలవగా, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో దాదాపు 90 గంటలపాటు లెక్కింపు సాగింది. వివిధ శాఖలకు చెందిన అయిదు వేల మంది సిబ్బంది, ఉన్నతాధికారులు రోజుకు మూడు విడతల్లో పనిచేశారు. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్గొండలో 100 గంటలకు పైగా కొనసాగింది.

మూడువేల మంది...

మూడు వేలమంది అధికారులు, సిబ్బంది, 71 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో రెండు చోట్లా అభ్యర్థుల తరఫు ఏజెంట్లు సుమారు ఆరు వేల మంది కంటి మీద కునుకు లేకుండా ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. బ్యాచుల వారీగా లెక్కించిన ఓట్లను నమోదు చేసుకుని తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు చేరవేశారు.

బ్యాలెట్‌ పెట్టెనే నలుగురు మోశారు

*హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు మార్చి 17న ఉదయం 5 గంటలకు మొదలై మార్చి 20న రాత్రి 10 గంటలకు ముగిసింది. లెక్కింపు ప్రక్రియ అనుకున్న సమయానికికన్నా మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. అందుకు జంబో బ్యాలెట్‌ పెట్టెలే కారణం. ఒక్కో పెట్టెను నలుగురు మోయాల్సి వచ్చింది. సుమారు 1,500 బ్యాలెట్‌ పెట్టెలను కౌంటింగ్‌ హాళ్లలోకి తెచ్చేందుకు సిబ్బంది నానా అవస్థలు పడ్డారు.

*మహబూబ్‌నగర్‌కు చెందిన 10 మంది స్వతంత్ర అభ్యర్థులు, ఓయూ విద్యార్థి సంఘాల నుంచి పోటీ చేసిన 8 మంది పీడీఎస్‌యూ నేతలు, పలువురు ఇతర పోటీదారులు రాత్రిళ్లు లెక్కింపు కేంద్రంలోనే మకాం వేశారు.

*సుదీర్ఘంగా, ఎర్రటి ఎండలో విధుల్లో ఉండటంతో పోలీసులతో పాటు పలువురు అభ్యర్థులు సైతం ఎప్పటికప్పుడు వైద్య సిబ్బందితో బీపీ, మధుమేహం పరీక్షలు చేయించుకోవడం కనిపించింది.

అమ్మా ఎప్పుడొస్తావ్‌ అంటోంది...

‘నాకు నాలుగేళ్ల పాప ఉంది. రెండు రోజుల విధి నిర్వహణ కోసం నల్గొండ వచ్చా. ఇక్కడే నాలుగు రోజులు ఉండిపోయేసరికి ఇంటి నుంచి పాప ఏడుస్తూ పదే పదే ఫోన్‌ చేసేది. విధుల్లో ఇలాంటివి తప్పవు కదా’ అని సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్సై అన్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ABOUT THE AUTHOR

...view details