తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఎస్ఎల్​వీ సీ-49 కౌంట్​డౌన్ ప్రారంభం - పీఎస్ఎల్వీ-సీ49 ప్రయోగానికి కౌంట్ డౌన్

పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహకనౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. నిరంతరాయంగా 26 గంటలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

పీఎస్ఎల్​వీ సీ-49 కౌంట్​డౌన్ ప్రారంభం
పీఎస్ఎల్​వీ సీ-49 కౌంట్​డౌన్ ప్రారంభం

By

Published : Nov 6, 2020, 10:22 PM IST

ఏపీ నెల్లూరులోని శ్రీహరికోట వేదికగా పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహకనౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.02 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3.02 గంటలకు వాహన నౌకను నింగిలోకి పంపనున్నారు. భారత్‌కు చెందిన భూపరిశీలన ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లనున్నాయి.

ప్రత్యేక పూజలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో పీఎస్ఎల్వీ-సీ49 ఉపగ్రహ నమూనాకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో డిప్యూటీ సెక్రెటరీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ ఈఓ పెద్దిరాజు తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:వరద సహాయంపై గవర్నర్​కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details