హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తెలంగాణ ఎంసెట్-2020లో 190వ ర్యాంకు పొందిన కె.రాజేశ్వరికి ప్రవేశ పత్రాన్ని విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ అందజేసి కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. ఈ మేరకు కె.రాజేశ్వరి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశం పొందింది.
అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ - jayashankar university latest news
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ నెల 16 వరకు కొనసాగే తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ స్పష్టం చేశారు.
అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
వ్యవసాయ అనుబంధ కోర్సులు అభ్యసిస్తోన్న విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలున్నాయని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఈ నెల 16 వరకు కొనసాగే తొలి విడత కౌన్సెలింగ్‌లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహరావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: నన్ను ఎవరూ సంప్రదించలేదు.. అవన్నీ అవాస్తవం: జానా