దృశ్య మాద్యమం ద్వారా తెలంగాణలోని 14 జాతీయ రహదారులను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ నుంచి దృశ్య మాద్యమం ద్వారా పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి: గుత్తా - హైదరాాబాద్ తాజా వార్తలు
పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారిని కోరారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి దృశ్య మాద్యమం ద్వారా జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి ఎన్ హెచ్-365బీబీ( 58.626కి.లో), నకిరేకల్-నాగార్జున సాగర్ ఎన్హెచ్-565 ( 85.45కి.మీ), యాదాద్రి-వరంగల్ ఎన్హెచ్163 (99.103km), నకిరేకల్-తానంచర్ల ఎన్హెచ్365 (66.58 km) జాతీయ రహదారుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపి జిల్లా భివృద్ధికి కృషి చేయాలని నితిన్ గడ్కారిని కోరారు.
ఇదీ చదవండి:ఏడోరోజు నిజ అవతారంలో భద్రాద్రి రామయ్య