రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల పూర్తి కోసం తెరాస సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు: గుత్తా - gutta sukhender reddy on projects
దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనేది అవాస్తవమన్నారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణ వచ్చాక తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తోందన్నారు.
ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు: గుత్తా
ఎస్ఎల్బీసీ సొరంగ నిర్మాణం 33 కిలోమీటర్లు పూర్తైందని... మిగతా పనులు కొనసాగుతున్నాయని గుత్తా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల దోపిడీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు మంత్రులుగా ఉండి నోరుమెదపలేదని... ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం దారుణమని గుత్తా వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:నిధుల సమీకరణపై టాటా గ్రూప్ కీలక ప్రకటన
Last Updated : Jun 6, 2020, 7:21 PM IST