వస్త్రాభరణాల ప్రదర్శనలో హీరోయిన్ సందడి - తాజ్ కృష్ణ హోటల్లో వస్త్రాభరణాల ప్రదర్శన
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఫ్రెండ్స్ పేరిట వస్త్రాభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సామాజికవేత్త సుశీల, సినీ కథానాయిక తానూ ఆ ప్రదర్శనను ప్రారంభించారు. రెండు రోజులపాటు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
దసరా దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలో వస్త్రాభరణాల ప్రియుల కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ పేరిట నిర్వహించే ప్రదర్శనను సామాజికవేత్త సుశీల, సినీ కథానాయిక తానూ ప్రారంభించారు.
లాక్‌డాన్ తర్వాత ప్రారంభించిన ఈ ప్రదర్శనకు నగర వస్త్ర అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. జాతీయ స్థాయిలో పేరొందిన డిజైనర్లు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అన్ని రకాలైన ఉత్పత్తులు ఒకే వేదికపై లభించడం చాలా ఆనందంగా ఉందని హీరోయిన్ తానూ అన్నారు.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నట్లు ట్రెండ్స్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు శాంతి తెలిపారు. కరోనా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్, బ్లౌజ్ అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో 40 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
ఇదీ చూడండి :వాయుగుండంగా అల్పపీడనం.. మరో మూడురోజుల పాటు వర్షాలు