తెలంగాణ

telangana

అవినీతి అధికారికి మూడేళ్ల జైలు శిక్ష

అక్రమ ఆస్తులు కూడగట్టిన కేసులో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అవినీతి అధికారికి ఏసీబీ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. 2002లో ఆయన నివాసం, కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

By

Published : Mar 4, 2020, 10:52 AM IST

Published : Mar 4, 2020, 10:52 AM IST

Corruption officer jailed for three years
అవినీతి అధికారికి మూడేళ్ల జైలు శిక్ష

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అవినీతి అధికారితోపాటు అతని తండ్రి, భార్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గోల్నాక సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌ వార్డెన్‌గా గతంలో పనిచేసిన రమావత్‌ మోత్యా నాయక్‌పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు రావడం వల్ల.. 2002లో ఆయన నివాసం, కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.5కోట్లకు పైగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.

ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష..రూ. 20 వేల జరిమాన

మోత్యాకు సహకరించినందుకు అతని తండ్రి కేశవనాయక్‌, భార్య విజయలక్ష్మిపై కూడా అధికారులు కేసులు నమోదు చేశారు. అధికారుల సోదాల అనంతరం అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆయను విధుల నుంచి పూర్తిగా తొలగించారు. కేసు విచారణలో రమావత్‌ మోత్యా నాయక్‌, ఆయన తండ్రి కేశవ నాయక్‌, భార్య విజయలక్ష్మికి ఏసీబీ కోర్టు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, 20 వేల రూపాయల జరిమానా చొప్పున విధించింది.

ఇవీ చూడండి: 'అప్రమత్తంగానే ఉన్నాం.. ఆందోళన చెందకండి'

ABOUT THE AUTHOR

...view details