హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కపూర్ డివిజన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గంగపుత్ర జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గుడిమల్కపూర్ డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ ప్రకాశ్ గంగపుత్ర 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వర్షాన్ని లెక్కచేయకుండా...
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నా... డివిజన్ ప్రజలు కార్యక్రమానికి హాజరుకావడం దేశభక్తికి ప్రతీక అని కార్పొరేటర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని మతాల సమగ్రత, సౌభ్రాతృత్వమే భారతదేశానికి చిహ్నమని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్ర పోరాట యోధుల బాటలో డివిజన్ ప్రజలు నడవాలని ప్రకాశ్ సూచించారు. కార్యక్రమంలో వార్డు కమిటీ సభ్యులు శివరాత్రి రాముల, టీటీయూసీ నాయకులు తిరుమలేశ్, ఏరియా సభా సభ్యులు రావుల మహేందర్ సహా స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ప్రగతిభవన్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్