హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ పరిధి గుడిమల్కాపూర్ డివిజన్లో కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర పర్యటించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ సందర్శించారు.
గజం స్థలం కూడా..
తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో గజం స్థలం కూడా కబ్జా కాకుండా కాపాడిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని గుడిమల్కపూర్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ గంగపుత్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులు, కుంటలు కుడా కబ్జా అయ్యాయని ఆయన గుర్తు చేశారు.