కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్ల స్థానాలు సంక్షిప్తంగా....
ఏఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎవరికి 'రిజర్వ్' చేశారంటే!
రాష్ట్రంలో నిర్వహించనున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీలకు, ఎస్సీలకు ఒక్కొక్కటి, బీసీలకు నాలుగు, జనరల్‌లో 7 స్థానాలను కేటాయించారు. మీర్‌పేట కార్పొరేషన్ మేయర్‌కు ఎస్టీ, రామగుండానికి ఎస్సీ కేటాయించగా... జవహార్‌నగర్, నిజామాబాద్, బండ్లగూడ, వరంగల్ స్థానాలను బీసీకి అవకాశమిచ్చారు. కరీంనగర్, బోడుప్పల్, ఖమ్మం, నిజాంపేట్, బడంగ్పేట్, ఫీర్జాదిగూడ, గ్రేటర్ హైదరాబాద్‌లను జనరల్‌కు కేటాయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 123 పురపాలికల ఛైర్మన్లలకు గానూ ఎస్టీలకు4, ఎస్సీలకు17, బీసీలకు 40, జనరల్‌లో 62 స్థానాలను కేటాయించారు.
CORPORATION MAYORS, MUNICIPAL CHAIRMEN RESERVATIONS RELEASED