సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని అంజయ్యనగర్, హస్మత్పేట్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం విపత్కర సమయంలోనూ ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.
'వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది' - ఆర్థిక సహాయం
వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. అంజయ్యనగర్, హస్మత్పేట్లోని వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
వరద బాధితులకు ఆర్థిక సహాయం
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాలకు నష్టపోయారని చెప్పారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల రూపాయలు.. కూలిపోయిన ఇళ్లకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :అవగాహన రాహిత్యంతోనే కేంద్రంపై విమర్శలు: కిషన్రెడ్డి