మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్బంగా 'గిఫ్ట్ ఎ స్మైల్' కార్యక్రమంలో భాగంగా వెయ్యి మంది ఈవీడీఎం సిబ్బందికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆరోగ్య బీమా చేయించారు. బుద్దభవన్లో ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ సమక్షంలో తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలను తెరాస నేత తలసాని సాయికిరణ్ అందించారు.
తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి కార్పొరేట్ ఆరోగ్య బీమా - ktr birthday
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెయ్యిమంది ఈవీడీఎం సిబ్బందికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ ఆరోగ్య బీమా చేయించారు. ఈవీడీఎం సిబ్బందికి తెరాస నేత తలసాని సాయికిరణ్ హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలను అందజేశారు.
![తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి కార్పొరేట్ ఆరోగ్య బీమా Corporate health insurance for EVDM staff on behalf of Talasani Trust for ktr birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8154715-587-8154715-1595589238430.jpg)
తలసాని ట్రస్ట్ తరపున ఈవీడీఎం సిబ్బందికి కార్పొరేట్ ఆరోగ్య బీమా
కార్పొరేట్ ఆస్పత్రుల్లో వెయ్యి మంది ఈవీడీఎం సిబ్బంది రూ 2 లక్షలు వరకు వైద్య సేవలు పొందొచ్చని సాయికిరణ్ తెలిపారు. రూ 20 కోట్ల విలువైన కార్పొరేట్ వైద్య సేవలు అందించుటకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా తలసాని ట్రస్ట్. 35 లక్షలు చెల్లించిందని వెల్లడించారు. బీమా చేయించిన తలసాని ట్రస్ట్‌కు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి: కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా నిత్యావసరాల పంపిణీ