ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా మెలిగేవాళ్లకు కరోనా సోకుతుండటం కలకలం రేపుతోంది. వాళ్లు స్వీయ నిర్భంధంలో ఉండగా.. జనగామ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు సైతం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గన్‌మెన్‌కు వైరస్ సోకింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఆయన కార్యాలయాన్ని వారం రోజుల పాటు మూసివేశారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎల్ఎన్ కాలనీలో వ్యక్తికి వైరస్‌రాగా అప్రమత్తమైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు..
రామ్‌గోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని వెంగల్‌రావునగర్‌లో పారిశుద్ధ్య కార్మికురాలికి కొవిడ్ నిర్ధరణ అవగా.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఘాస్మండిలో ఓ మహిళకు మహమ్మారి సోకింది. రాంనగర్‌లోని మోహన్‌నగర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు, ముషీరాబాద్‌లో నివాసముండే ల్యాబ్ టెక్నీషియన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. అడ్డగుట్టలో నివాసముంటూ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సోకగా.. గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముసాపేట్‌లో ఐదుగురికి కరోనా నిర్ధరణ కావడంతో అప్రమత్తమైన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
19 మందికి కరోనా