కరోనా అంటే.. ప్రత్యేకంగా కొన్ని లక్షణాలు చూసి పాజిటివ్ అని తేల్చేవారు. అయితే.. క్రమంగా కరోనా తన తీరు మార్చుకుంటున్నది. లక్షణాలు ఉన్న వారి ద్వారానే కాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల వల్ల కూడా కరోనా వ్యాపిస్తుందని తేల్చి చెప్పారు సిచుయాన్ యూనివర్సిటీ అధ్యయనకర్త జియాంగ్ జాంగ్.
లక్షణాల్లేకున్నా కరోనా వ్యాప్తిస్తుంది! - కరోనా పాజిటివ్
లక్షణాలు ఉన్న వారిలా మాత్రమే కాదు.. లక్షణాలు లేని పాజిటివ్ ఉన్న వారి ద్వారా కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందంట. లక్షణాలు లేకపోయినా వారి వల్ల ఇతరులకు కరోనా సోకుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
లక్షణాల్లేకున్నా కరోనా వ్యాప్తిస్తుంది!
లక్షణాలు లేవని కరోనా పాజిటివ్ వ్యక్తులను మరో గదిలో ఉంచినంత మాత్రాన చుట్టుపక్కల వారు భద్రంగా ఉన్నట్టేం కాదు.. వారి ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని, కరోనా బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా వైరస్ వ్యాపించే ప్రమాదముందని జియాంగ్ జాంగ్ తెలిపారు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం