తెలంగాణ

telangana

By

Published : Mar 28, 2020, 5:23 PM IST

ETV Bharat / state

'కరోనాపై కాలజ్ఞానంలో అలా చెప్పలేదు'

కడప జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం గురించి సోషల్​ మీడియాలో వదంతులు షికార్లు చేస్తున్నాయని ఆలయ మేనేజర్‌ ఈశ్వరయ్యచారి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఆలయం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

kadapa
'కరోనాపై కాలజ్ఞానంలో అలా చెప్పలేదు'

కరోనా నేపథ్యంలో కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆలయ మేనేజర్‌ ఈశ్వరయ్య చారి ఖండించారు. ఆలయంలో పూజారి చనిపోయాడని వస్తున్న వార్త అవాస్తవం. మిరియాలు, అల్లం, బెల్లం కలిపిన నీటిని తాగితే కరోనాను నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్టుగా సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని తెలిపారు.

అసత్య వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కథనాలు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దీనిపై డీజీపీ, కడప ఎస్పీకి ఫిర్యాదు లేఖలు పంపుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details