ర్వాపిడ్ పరీక్షల్లో నిర్ధరణ కాకపోతే అతనికి కరోనా లేనట్లు చెప్పలేం. కొన్నిసార్లు లక్షణాలు ఉన్నా నెగెటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివారు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేసుకోవాలి. నోరు, ముక్కు నుంచి స్వాబ్‌ను తీసి ఈ పరీక్ష చేస్తారు. వాస్తవానికి 12 నుంచి 24 గంటల్లో నివేదిక రావాలి. రోగుల సంఖ్య పెరుగుతుండటం వల్ల కొన్నిసార్లు అయిదు రోజులకూ తెలియడం లేదు. ఫలితాలు వచ్చేలోపు కొందరి ఆరోగ్యం విషమిస్తోంది.
అన్ని ప్రాంతాల్లోనూ కేసులు...
గురువారం గ్రేటర్‌లో 788 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్‌లో 160మంది కరోనా బారినపడ్డారు. 10 మంది చనిపోయారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో 64 మంది, ఉప్పల్ పరిధిలో 54.. ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్‌పేట, సనత్‌నగర్‌లలో 68 మంది, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహ్మత్‌నగర్, వెంగళ్‌రావునగర్‌లో 58 మందికి కరోనా సోకింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలు ఉంటే 1075, 104తోపాటు టోల్‌ఫ్రీ 1800 599 4455కు సంప్రదించాలని సూచిస్తున్నారు.