తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉదయం నుంచి బస్సులోనే.. ఆపై రోడ్లపై 47 మంది కొవిడ్ బాధితులు - ఏలూరులో ఉదయం నుంచి బస్సులోనే కరోనా బాధితులు

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. కొవిడ్ కేంద్రాలు ఖాళీ లేక ఏలూరు నుంచి వచ్చిన 47 మంది వ్యాధి బాధితులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. కొవిడ్ కేంద్రాల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

corona-victims-waiting-in-bus-from-mornig-at-eluru
ఉదయం నుంచి బస్సులోనే.. ఆపై రోడ్లపై 47 మంది కొవిడ్ బాధితులు

By

Published : Jul 24, 2020, 9:52 AM IST

కరోనా బాధితులను జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మిగతా వారితో సంబంధం లేకుండా వారికి ఏర్పాట్లు చేయాలి. కానీ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో బస్సులోనే కరోనా బాధితులు పడిగాపులు కాయాల్సి వచ్చింది.


చింతలపూడిలో అర్ధరాత్రి కరోనా బాధితులను అడవిలో వదిలి పెట్టిన ఘటన జరిగిన రెండో రోజే మరో ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లాలో కొవిడ్ కేంద్రాలు ఖాళీ లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఏలూరు నుంచి మధ్యాహ్నం బస్సులో బయలుదేరిన 47 మంది కొవిడ్ రోగులు సాయంత్రం అయినా కేంద్రానికి చేరలేదు. ఏలూరు శివారులోనే బస్సును నిలిపివేసి రోగులను ఇబ్బందులు పెట్టారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం కొవిడ్ కేంద్రాలు నిండిపోవడంతో వారిని ఎటు తరలించాలో పాలుపోక అధికారులు బస్సును నిలిపివేశారు. కొవిడ్ కేంద్రాల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద 47 మంది రోగులు ఉన్న బస్సును సాయంత్రం 6 గంటల వరకు నిలిపివేశారు. ఏలూరు కొవిడ్ సెంటర్లో 300 మందిని డిశ్ఛార్జి చేసినా అక్కడకు తరలించే ఏర్పాట్లు చేయలేదని రోగులు అంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బస్సులో ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేసినా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో అన్ని కేంద్రాలు నిండిపోతున్నాయి. భోజనం, నీరు లేక ఆరుబయటే వారు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని కొవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details