కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించలేదని ఓ కరోనా బాధితుడు గొంతు కోసుకున్నాడు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడాడు. బాధితుడిని వైద్యులు ఐసీయూలోకి తరలించారు. కానీ చాలాసేపటి వరకు చికిత్స అందించలేదని బాధితుడి కుమారుడు ఆరోపించాడు.
చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు - కడప కరోనా వార్తలు
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కరోనా బాధితుల పాలిట శాపంగా మారుతోంది. సత్వర వైద్య సేవలు అందక కొంతమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏపీలోని కడపలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
చికిత్స అందించలేదని గొంతు కోసుకున్న కరోనా బాధితుడు
ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావటంతో ఎట్టకేలకు వైద్యులు స్పందించి చికిత్స అందిస్తున్నారని వెల్లడించాడు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు