గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో కరోనా వైరస్ (corona virus) తీవ్రత తగ్గింది. రోజూ 500 వరకు కేసులు వస్తుండగా రాజధాని పరిధిలో 150 నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య తగ్గడంతో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూడొంతుల మంది మాస్కులు కూడా ధరించడం లేదు. కరోనా వచ్చినా మనకేం కాదన్న ధీమాతో చాలా మంది కొద్ది రోజులుగా టీకా వేసుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. మహానగరంలో మూడు నెలల్లో అందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం వంద టీకా కేంద్రాలను బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రైవేటు సంస్థలకు ఈ కేంద్రాల నిర్వహణ బాధ్యత అప్పగించారు. మొదట్లో అన్ని జనంతో కిటకిటలాడేవి. నిర్వాహకులు తమ కేంద్రాల్లో పని చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం మానేశారు. దీంతో ఈ సిబ్బంది అప్పటి వరకు ఎంతమందికి టీకాలు వేశారన్న సమాచారంతో ఉన్న ల్యాప్‌ట్యాప్‌లను కూడా తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో మెహిదీపట్నం లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో టీకా కేంద్రాలు మూతపడ్డాయి. దాదాపు 50 కేంద్రాల వరకు మూతపడినట్లు చెబుతున్నారు. బల్దియా అధికారులు జోక్యం చేసుకుని సిబ్బందికి మూడు నెలల జీతాలు చెల్లించేలా చేసి తిరిగి ఈ కేంద్రాలను తెరిపించే ఏర్పాట్లు చేయడం లేదు.
మధ్యాహ్నానికే తాళం