హైదరాబాద్ నగరంలోని ఐటీ సంస్థలు వారి ఉద్యోగుల కోసం భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్ పలు ఐటీ సంస్థలు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున పోటెత్తారు.
Vaccination: ఐటీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సినేషన్ - ఐటీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్
హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో పలు ఐటీ సంస్థలు ఉద్యోగుల కోసం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టింది. ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చి.. వ్యాక్సిన్ తీసుకుంటున్నారు.
vaccination
దాదాపు కిలోమీటరు వరకు క్యూలైన్ ఏర్పడింది. గంటల తరబడిగా క్యూలైన్లో నిలబడాల్సి వచ్చింది. ఐటీ ఉద్యోగులకు వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుండగా.. వారి కుటుంబ సభ్యులకు కొంత వరకు నగదు తీసుకుని టీకా వేస్తున్నారు.
ఇదీ చూడండి: తెరాసకు ఈటల రాజేందర్ గుడ్‌బై