హైదరాబాద్‌లో నాలుగు సెంటర్లలో రేపు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. జంట నగరాల్లోని 3 ప్రభుత్వ, ఒక ప్రైవేటు ఆస్పత్రిలో డ్రైరన్ చేయనున్నారు. గాంధీ ఆస్పత్రి, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్‌నగర్ యూపీహెచ్సీ, సోమాజిగూడ యశోద ఆసుపత్రిల్లో డ్రైరన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌కు ఏర్పాట్లు పూర్తి: శ్వేత మహంతి
రేపు హైదరాబాద్‌లో చేపట్టబోయే కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌కు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ శ్వేత మహంతి తెలిపారు. జంట నగరాల్లోని 3 ప్రభుత్వ, ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్‌కు ఏర్పాట్లు పూర్తి: శ్వేత మహంతి
వ్యాక్సిన్ డ్రైరన్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్వేత మహంతి పాల్గొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ విధానం, పేర్ల నమోదు, వ్యాక్సినేషన్ సెంటర్లని గుర్తించడం, వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల చర్చించారు.