తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... బుధవారం 1,018 కొత్త కేసులు - తెలంగాణలో కరోనా కొత్త కేసులు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో 1,018 కొత్త కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బాధితుల సంఖ్య 17 వేలు దాటింది. నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనా చికిత్సలు ప్రారంభంకానున్నాయి.

new corona positive cases
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... బుధవారం 1,018 కొత్త కేసులు

By

Published : Jul 2, 2020, 4:46 AM IST

రాష్ట్రంలో రోజురోజుకు కొవిడ్‌ మహమ్మారి ఉగ్రరూపు దాల్చుతోంది. బుధవారం 4,234 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా... రికార్డు స్థాయిలో 1,018 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో వెయ్యికిపైగా కేసులు నమోదుకావడం ఇది రెండోసారి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. మహమ్మారికి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 267 చేరింది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు

బుధవారం నమోదైన వాటిలో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 881 కేసులు వచ్చాయి. మేడ్చల్‌ జిల్లాలో 36, రంగారెడ్డిలో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 10 కేసులు వెలుగుచూశాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో 9, ఖమ్మంలో 7, నల్గొండ జిల్లాలో 4, జగిత్యాలలో4 కేసులు నిర్ధరణ అయ్యాయి. నిజామాబాద్‌లో 3 కేసులు నమోదవ్వగా... సంగారెడ్డి, కరీంనగర్‌, సూర్యాపేట, కామారెడ్డి, ములుగు, ఆసిఫాబాద్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. గద్వాలలో ఒకరికి కరోనా సోకింది.

మొత్తం 8,082 మంది కోలుకున్నారు

రాష్ట్రంలో ఇప్పటివరకూ 92,797 కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. బుధవారం మహమ్మారి నుంచి కోలుకుని 788 మంది డిశ్చార్జి కాగా.... మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,082కు చేరుకుంది.

నేటి నుంచి అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనా చికిత్స

రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల్లోనూ నేటి నుంచి కరోనా చికిత్సలు ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో... కరోనా చికిత్సకు జరుగుతున్న ఏర్పాట్లను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ బుధవారం పరిశీలించారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి, సంతోశ్‌నగర్‌లోని ఒవైసీ ఆస్పత్రులను సందర్శించిన మంత్రి... నేటి నుంచి కరోనా చికిత్సలు ప్రారంభించాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు స్పష్టం చేశారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో చికిత్సల అందించడం వల్ల బాధితులకు విస్తృతంగా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

హైదరాబాద్‌ వనస్థలీపురంలో కరోనా పరీక్షల కోసం ఏర్పాట్లు చేశారు. నమూనాల సేకరణకు ఉపయోగపడే కియోస్క్‌ మిషన్‌ను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ అధికారులకు అందించారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డ్​ స్థాయిలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details