తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా - corona update in telangana

corona-update-in-state
రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

By

Published : Jun 6, 2020, 9:22 PM IST

Updated : Jun 6, 2020, 9:59 PM IST

21:18 June 06

రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా

ఈరోజు 206 మందికి కరోనా

రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 206 కేసులు నమోదవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో వైరస్​ సోకిన బాధితుల సంఖ్య 3,496కు చేరింది. ఈరోజు 10 మంది కరోనాతో మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 123కి చేరింది. ఇప్పటివరకు 1,710 మంది డిశ్చార్జ్​ కాగా... ఆసుపత్రుల్లో 1,663 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోవి కాగా... మేడ్చల్​లో 18, రంగారెడ్డిలో 10,  నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో 5, మహబూబ్‌నగర్‌ 4, జగిత్యాల 2, నాగర్‌కర్నూల్‌ 2, మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో  పాజిటివ్‌ కేసు నమోదైంది.

ఇవీ చూడండి:రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా

Last Updated : Jun 6, 2020, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details