తెలంగాణ

telangana

ETV Bharat / state

చంద్రబాబు ఇంటివద్ద విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్​కు కరోనా - కరోనా తాజా వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద కరోనా కలకలం రేపింది. విధుల్లో పాల్గొన్న కానిస్టేబుల్​కి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది​. తన తోటి కానిస్టేబుల్​ నుంచి అతనికి సోకినట్లు తెలిసింది.

corona to the nara chandrababu naidu home constable
గుంటూరు జిల్లాలో కానిస్టేబుల్​కి కరోనా పాజిటీవ్

By

Published : Jun 14, 2020, 8:26 AM IST

హైదరాబాద్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొని వచ్చిన గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కానిస్టేబుల్‌ కరోనా బారినపడ్డారు. బాపట్ల పట్టణ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ మే 5న విధుల నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లి ఈ నెల 7న వచ్చారు. అనుమానిత లక్షణాలు ఉండగా మూడు రోజుల క్రితం పరీక్ష చేశారు. శనివారం వచ్చిన ఫలితాల్లో వైరస్‌ సోకినట్లు తేలింది. హైదరాబాద్‌లో తోటి కానిస్టేబుల్‌ నుంచి అతనికి సోకినట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details