కరోనాను ఆసరాగా చేసుకొని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌కి చెందిన ఓ కంపెనీ మానవతా దృక్పథంతో మాస్కులు, శానీటైజర్లు పంపిణీ చేసింది. థర్మామీటర్లను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇదే అదునుగా... సైబర్ మోసాలు - latest cyber crime news in hyderabad
కరోనా విపత్తు అదునుగా సైబర్ మోసాగాళ్లు రెచ్చిపోతున్నారు. థర్మామీటర్ల కోసం ఆర్డర్ ఇచ్చి తీరా డబ్బులు చెల్లించాకా... అందలేదంటూ లక్ష రూపాయలకు బురిడి కొట్టించిన ఘటన మన హైదరాబాద్‌లోనే జరిగింది.

థర్మామీటర్లను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ యజమాని శరత్ చంద్ర జస్ట్ డయల్ ద్వారా పూణేకు చెందిన ఓ కంపెనీ వివరాలు తీసుకున్నాడు. వారు మేం సప్లై చేస్తామంటూ ఫోన్ చేశారు. వారికి 300 థర్మా మీటర్ల ఆర్డర్ ఇచ్చాడు. అందుకు అడ్వాన్స్‌గా రూ. లక్ష ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే డబ్బులు తమకు రాలేదని బుకాయించినట్టు శరత్ తెలిపారు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి :సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు