గ్రేటర్‌లో పునఃప్రారంభమైన విస్తృత కరోనా పరీక్షలు - Corona tests started in greater hyderabad
13:10 June 30
హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు పునఃప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. సరోజిని కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయంలో కరోనా పరీక్షలు పునఃప్రాంరంభించారు. ఆయుర్వేదిక్, చార్మినార్, నిజామియా ఆస్పత్రుల్లో నమూనాలు సేకరిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో రోజుకు 250 చొప్పున కరోనా పరీక్షలకు నమూనాలు తీసుకుంటారు.
కొండాపూర్, వనస్థలిపురం ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ కొవిడ్ టెస్టులు మొదలయ్యాయి. బాలాపూర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, మహేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నమూనాలు తీసుకుటుంన్నారు. ఆయా కేంద్రాల్లో రోజూ 150 శాంపిల్స్ సేకరిస్తారని అధికారులు తెలిపారు. ఇటీవల శాంపిల్స్ సేకరణ అధికం కావడం.. ఫలితాలు రాకపోవడంతో విస్తృత పరీక్షలు నిలిపివేశారు. ఆయా టెస్టుల వివరాలు వెల్లడికావడంతో గ్రేటర్ పరిధిలో వైరస్ నిర్ధరణ పరీక్షలు మళ్లీ మొదలుపెట్టారు