తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్ష ఇలా చేయించుకోవాలి! - latest news of rangareddy

ఓవైపు చెకప్ కోసం వచ్చిన గర్భిణి స్త్రీలు.. మరోవైపు రోజువారి ఓపీ పేషెంట్లు.. ఇంకోవైపు కరోనా అనుమానితులు ఇలా టెస్టుల కోసం వచ్చిన వారితో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి నిత్యం రద్దీగా మారుతుంది. కాగా కొవిడ్​ పరీక్షకు వచ్చిన వారిలో కొందరికి ఫలితాలు రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని అడగాలో ఎలా సంప్రదించాలో తెలియక దవాఖానా ముందు పడిగాపులు కాస్తున్నారు.

corona tests in vanastalipuram area hospital in rangareddy
ఆ ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్ష ఇలా చేయించుకోవాలి!

By

Published : Jul 15, 2020, 9:52 AM IST

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గత బుధవారం నుంచి కరోనా పరీక్షలు చేస్తున్నారు. కాగా లక్షణాలతో కొందరు.. ప్రైమరీ కాంటాక్ట్ మరికొందరు.. ఇలా నిత్యం వందలాది మంది కరోనా అనుమానితులు పరీక్షల నిమిత్తం దవాఖానాకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే కొందరికి మాత్రమే రిపోర్ట్స్ వచ్చాయి చాలా మందికి తమకు పాజిటివ్ వచ్చిందా రాలేదా అనే ఫలితాలు రాక ఆవేదనకు గురవుతున్నారు. ఎవరిని సంప్రదించాలో తెలియక మళ్లీ ఏరియా హాస్పిటల్​ చుట్టూ తిరుగుతున్నారు.

ఆసుపత్రిలో కరోనా పరీక్ష ఇలా చేయించుకోవాలి

పరీక్షల నిమిత్తం వచ్చిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం వారికి రెండు మూడు రోజుల్లో మెసేజ్ వస్తుంది. ఆ తర్వాతనే పరీక్షల కోసం రావాలి. గురువారం, శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మంగళవారం పరీక్షలు చేశారు. రద్దీ పెరిగినందున మంగళవారం నుంచి రాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నుంచి ఎలాంటి సమాచారం ఉండటం లేదని వచ్చిన వారంతా ఆవేదనతో తిరిగి వెళ్తున్నారు.

మంగళవారం ఆసుపత్రిలో 69 మందికి రాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 10 మందికి పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి:భర్త ఇంటి ఎదుట కొడుకుతో కలిసి భార్య నిరసన

ABOUT THE AUTHOR

...view details