తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు - ఏపీలో కరోనా పరీక్ష ధరలు తగ్గింపు న్యూస్

ఏపీలో కరోనా పరీక్షల ధరలను ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత తగ్గించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Dec 15, 2020, 7:48 PM IST

కరోనా పరీక్షల ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టింగ్ ధరలను రూ.800 నుంచి 475 రూపాయలకు తగ్గించారు. ఎన్ఏబీఎల్ ల్యాబుల్లో చేసే కరోనా టెస్టింగ్ ధరలను రూ.1000 నుంచి 499 రూపాయలకు తగ్గించారు.

కరోనా టెస్ట్ కిట్ల తయారీ ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వాటి ధరలు తగ్గాయని.. దీనివల్లే కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు తగ్గించినట్లు ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తగ్గించిన ధరలను అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ల కార్యాలయాలు 4 విభాగాలుగా వర్గీకరణ

ABOUT THE AUTHOR

...view details